రాగి తీగల చోరీ కేసులో నలుగురు పట్టివేత

మాచవరం, బెల్లంకొండ మండలాల్లో పంట పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల రాగి తీగలను దొంగిలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో శ్రీరుక్మిణిపురానికి చెందిన శేషగిరి, రంగానాయక్‌తో పాటు కొత్త గణేశ్‌పాడుకు చెందిన ఇద్దరు మైనర్లు ఉన్నట్లు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు. పిల్లుట్ల గ్రామంలో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్