గురజాల తహశీల్దార్ సస్పెండ్

గురజాల మండల తహశీల్దార్గా పనిచేస్తున్న కుటుంబరావుని విధుల నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో దాచేపల్లి తహశీల్దార్ ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల అక్రమాలపై, మ్యుటేషన్లపై ఆరోపణలు వచ్చినందున సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాలలోని ప్రభుత్వ భూముల అక్రమ మ్యుటేషన్ల ఆరోపణలపై ఉన్నతాధికారుల విచారణ తర్వాత సస్పెండ్ చేసినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్