పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ ఆరోగ్య దర్శనీ కార్యక్రమం

మాచవరం మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ ఆరోగ్య దర్శనీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీకృష్ణదేవరాయలు మహిళలకు ఆరోగ్య భద్రతపై శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి, అర్హులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్