పిడుగురాళ్లలో భారీ మంచు: ఊటీని తలపిస్తున్న దృశ్యాలు, వాహనదారులకు సూచనలు

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం తెల్లవారుజాము నుండి భారీగా మంచు కురుస్తోంది. ఈ దృశ్యాలు ఊటీని తలపిస్తున్నాయి. మంచు తీవ్రత కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా లైట్లు వేసుకుని వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ చలిగాలులకు ఆస్తమా, ఉబ్బసం, నెమ్ము వంటి వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్