మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి బుధవారం వీరుల మహోత్సవం సందర్భంగా తనయుడు జూలకంటి సాయి వివేకానందరెడ్డితో కలసి స్థానిక వీర్ల దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు అందుకుంటున్న పల్నాటి యుద్ధం సమయంలో వాడిన ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, చేత పట్టుకొని అలనాటి పౌరుషాలను గుర్తు చేసుకున్నారు. వీరుల ఆయుధ సంపత్తి పౌరుషాలకు ప్రతీక అని ఆయన వివరించారు.