గురజాల బైపాస్ రోడ్లో శనివారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.