అగ్రకులస్తుల హత్యపై ఎంఆర్పీఎస్ఎస్ నిరసన, పరిహారం డిమాండ్

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్ఎస్) వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుండాల నగేష్ మాదిగ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో నిరసన తెలిపారు. పది రోజుల క్రితం ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఎం రమేష్ మాదిగను కొందరు అగ్రకులస్తులు ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. హత్య చేసిన వారిలో కొందరిని అరెస్ట్ చేసినప్పటికీ, దీని వెనుక ఉన్న వారిని కూడా త్వరలో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టి.ఎం రమేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, ఒక ఉద్యోగం, 5 ఎకరాల సాగుభూమి ఇవ్వాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్