పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వెంటనే మృతుని భార్యకు స్వైస్ పెన్షన్ను అందజేయటం ఈ ప్రభుత్వం కొత్త విధానానికి నాంది పలికిందని ఎమ్మెల్యే అన్నారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.