మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో ఆదివారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పాడి పరిశ్రమల కోసం అందజేస్తున్న గోకులం షెడ్లను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాడి పరిశ్రమల అభివృద్ధికి ఈ గోకులం కేంద్రాలు ఏర్పాటు చేశారని, నిర్వాహకులు వీటిని సక్రమంగా వినియోగించుకొని పశువులను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.