మహాశివరాత్రి ఏర్పాట్లపై ఎమ్మెల్యే యరపతినేని సమీక్ష

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురజాల నియోజకవర్గంలోని శైవ క్షేత్రాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం గురజాల ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. మాచవరం మండలం బుగ్గ మల్లేశ్వర స్వామి దేవాలయం, పిడుగురాళ్ల మండలం గుత్తికొండ, గురజాల దైద అమరలింగేశ్వర స్వామి, రెంటచింతల సత్రశాల, దాచేపల్లి మండలాల్లోని ఆలయాల్లో ఏర్పాట్లు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మురళి, డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్