గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం మానవత్వం చాటుకున్నారు. పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి వెళ్తుండగా, బ్రాహ్మణపల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని గమనించి, తన కాన్వాయ్ ఆపి, అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు. వైద్య ఖర్చుల కోసం రూ. 10 వేల ఆర్థిక సహాయం కూడా అందజేశారు.