పులిపాడులో వరి గడ్డి కట్టలు అగ్నికి ఆహుతి

గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో రైతు బండి శంకర్ పశువుల మేత కోసం నిల్వ ఉంచిన సుమారు 1300 వరి గడ్డి కట్టలు అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని రైతు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సుమారు రూ. 2.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న గురజాల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్