పల్నాడు: మరో 10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం..!

పిడుగురాళ్ల (M) తుమ్మలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లికార్జునరెడ్డి (24) అనే యువకుడు మృతి చెందినట్లు CI వెంకట్రావు తెలిపారు. ఈ నెల 12న వివాహం నిశ్చయమైన మల్లికార్జునరెడ్డి, పిడుగురాళ్లలో పెళ్లి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్