శుక్రవారం రాత్రి పిడుగురాళ్లలోని తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దాచేపల్లి మండలం సారంగపల్లికి చెందిన సంపతి కోటేశ్వరరావు (43) మరణించారు. పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి వైపు వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. పోలీసులు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.