దాచేపల్లి టౌన్ పరిధిలోని 11కేవీ లైన్లు మర్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో విద్యుత్ అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ భగవాన్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు, రైతు సోదరులు, ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.