ప్రసన్నాంజనేయ స్వామి రథోత్సవం: ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభం

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని ప్రజాశక్తి నగర్ నందు కొలువైయున్న సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి 19వ వార్షికోత్సవం సందర్భంగా రథోత్సవం మరియు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, గురజాల ఆర్డిఓ మురళీకృష్ణ గారు, గురజాల డి.ఎస్.పి జగదీష్ గారు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుండి ఆంధ్ర బ్యాంక్ సెంటర్ వరకు జరిగిన రథోత్సవ ఊరేగింపును ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్