చిత్తూరు జిల్లా వికోటలో పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ దాచేపల్లిలో జర్నలిస్టులు బుధవారం నిరసన చేపట్టారు. స్థానిక బంగ్లా సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి సీఐ రాజేశ్‌కు వినతిపత్రం అందజేశారు. హత్యకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, పాత్రికేయులకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న వరుస దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.