మారేడుమల్లి ఎన్కౌంటర్లపై ప్రజా సంఘాల ఆగ్రహం

అల్లూరి జిల్లాలోని మారేడుమల్లిలో ఈ నెల 18న హిడ్మా–రాజే సహా నలుగురు, 19న టేక్ శంకర్‌తో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన వరుస ఎన్కౌంటర్లపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత రెండేళ్లుగా కగార్ పేరుతో 720 మందికి పైగా ఆదివాసులు, మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందుతున్నా విచారణ లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దాడులు జరుగుతున్నాయని, ప్రజా ఉద్యమాలే హక్కులకు మార్గమని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని, దమనకాండను ఆపాలని నరసరావుపేట గాంధీ పార్క్‌లో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్