మాచవరం మండలం మొర్జంపాడు సమీపంలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయ శాశ్వత ధర్మకర్తల ఆధ్వర్యంలో మహాగణపతి పూజ, పూర్ణాహుతి, మోదక హోమం నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, పూల అలంకరణ తర్వాత స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలు అందజేశారు.