రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, సత్తెనపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు రాజుపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంచుల నరసింహారావు ఆధ్వర్యంలో కొండమూడు జంక్షన్ లో హైవే రోడ్డుపై కూటమి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు శనగపూల వెంకయ్య మాట్లాడుతూ, అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించారు.