గురజాల పట్టణంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాజెక్ట్ చైర్మన్ పులుకూరి కాంతారవు మాట్లాడుతూ, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవం అవమానాలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు చలించి 1982 మార్చి 29న ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారని, సినీ జీవితంలోనే కాకుండా రాజకీయ జీవితంలో కూడా ఎన్టీఆర్ సాటిలేని మహానాయకుడని కొనియాడారు.