బుధవారం సచివాలయం-2లో జరిగిన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో వక్తలు, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడి, ఎరువుల వాడకం తగ్గించడం, సాగునీటి నిర్వహణ వంటి అంశాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోందని, దీని ద్వారా మెరుగైన దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు.