మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 37 మంది లబ్ధిదారులకు రూ. 26.80 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి ఒక ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్ధాయి కూటమి పార్టీల నాయకులు, వెల్దుర్తి మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.