వైసిపి రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరచాలని చూసింది: ఎమ్మెల్యే యరపతినేని

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం పిడుగురాళ్ల టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ, వైసిపి నాయకులు ఈ రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరచాలని చూశారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేసేందుకు అంబేద్కర్ రాజ్యాంగం రచించారని, పులివెందల ఒంటె మెట్టలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుపరిచారు గానీ రాజారెడ్డి రాజ్యాంగం నడవలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్