గేదెలను తప్పించబోయి ప్రమాదం.. వ్యక్తి మృతి

వెల్దుర్తి మండలం దావుపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన రమేశ్ (50) అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెలను తప్పించబోయిన కారు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్