విజయపురి సౌత్ స్టేషన్ నుంచి నిందితుడు పరార్

గురువారం మాచర్ల విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక నిందితుడు పరారయ్యాడు. కొత్తూరు దేవస్థానంలో వెండి నగల చోరీ కేసులో అరెస్టయిన పిడుగురాళ్లకు చెందిన జానీ, రెండు రోజుల క్రితం లాకప్ నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్