గ్రామీణ పీఎం ఆవాస్ యోజన- ఎన్టీఆర్ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఈ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగించినట్లు కారంపూడి హౌసింగ్ ఏఈ బాబురావు తెలిపారు. ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకునేవారు మండల కార్యాలయం లేదా గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని ఆయన సూచించారు.