పల్నాడులో దారుణం.. మురుగుకాలువలో రోజుల పసికందు

పల్నాడు జిల్లా కారంపూడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం మురికి కాలువలో ఒక పసికందు మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఆ శిశువును కాలువలోంచి బయటకు తీసి పూడ్చివేశారు. రోజుల పసికందును మురుగు కాలువలో వేయడం మానవత్వంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్