రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామ పరిధిలో సోమవారం రాత్రి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి విసిరిన బీర్ బాటిల్ ఎస్కార్ట్ వాహనాన్ని తాకింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన మిట్టగుడిపాడుకు చెందిన వైసీపీ కార్యకర్త షేక్ సైదాను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.