టిడిపి నాయకుడిపై దాడి: ఏడుగురి అరెస్ట్, బహిరంగంగా తరలింపు

గురజాల మండలం, తేలుకుట్ల గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు బత్తుల ఏడుకొండలపై గత నెల 25వ తేదీన జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు గురజాల సిఐ భాస్కర్ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను గురజాల ప్రధాన రహదారిపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు తీసుకెళ్లడం ప్రజల్లో చట్టంపై నమ్మకం పెంచడం, నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదనే సందేశం ఇవ్వడమే ఈ చర్య ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను పిడుగురాళ్ల కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ చర్యతో ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్