కంభంపాడులో సివిల్ రైట్స్ డే: తహశీల్దార్ కిరణ్ కుమార్ పిలుపు

మాచర్ల మండలంలోని కంభంపాడు ఎస్సీ కాలనీలో నిర్వహించిన 'సివిల్ రైట్స్ డే' (పౌర హక్కుల దినోత్సవం) కార్యక్రమానికి మాచర్ల తహశీల్దార్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో అందరూ సమానమేనని, అంటరానితనం వంటి వివక్షలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. పౌర హక్కుల పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరారు. కాలనీ వాసులు తమ సమస్యలను తహశీల్దార్ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అనిల్ కుమార్, వీఆర్వో అంజి, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్