సమగ్ర కుటుంబ సర్వేను మండల ప్రజలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఎంపీడీవో గంట శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రయోజనాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో ఈ సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. కారంపూడి మండలంలో 18,246 కుటుంబాలు ఉండగా, కేవలం 2,961 కుటుంబాలు మాత్రమే సర్వే చేయించుకున్నాయని ఆయన పేర్కొన్నారు.