గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపవద్దని ఆయన అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, కొన్నింటిని నేరుగా ఫోన్లో అధికారులకు సూచించి పరిష్కరించాలని ఆదేశించారు.