దుర్గి: ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి వైర్ల చోరీ

దుర్గి మండలం వినుకొండ రోడ్డులోని సూరె శ్రీనివాసరావు పొలంలో గుర్తుతెలియని దుండగులు పంపుసెట్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి, అందులోని రాగి వైర్లను అపహరించారు. ఈ ఘటనతో విద్యుత్ శాఖ ఏఎల్ఎం బర్మానాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు. సాగు కాలంలో ఇలాంటి దొంగతనాలు జరుగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్