ఉపాధి హామీ: 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలకు సన్మానం

మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని పూర్తి చేసిన 200 కుటుంబాలను అధికారులు సన్మానించారు. కంభంపాడు గ్రామానికి చెందిన ఎల్లాపి వెంకటేశ్వర్లును ఎంపిడిఓ ఫణి కుమార్ శాలువాతో ఘనంగా సత్కరించారు. మండలంలోని శ్రామికులు 100 రోజుల పనిని పూర్తిగా వినియోగించుకోవాలని, వీబీజీ పథకం కింద 125 రోజుల వరకు పని అవకాశం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్