యడవల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుంచి విజయవాడ వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని గ్రానైట్ లారీ వేగంగా ఢీకొనడంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్