కారంపూడి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రామ సభలలో ఉపాధి హామీ పథకం పనుల గురించి, రాబోయే రోజుల్లో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.