కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. కారంపూడి పట్టణంలోని అంబేద్కర్ గురుకులంలో 'మెగా పేరెంట్-టీచర్ మీట్ 2. 0' జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పాటుపడుతోందని అయన అన్నారు. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.