కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మాచర్ల శాసనసభ్యుల జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. కారంపూడి మండలంలోని గాదేవారిపల్లె గ్రామంలో శుక్రవారం "సూపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టిడిపి " కార్యక్రమాన్ని శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు.