కారంపూడి మండలం, వేపకంపల్లి ఎంపీటీసీ స్థానానికి జరనున్న ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రెండు నామినేషన్లు దాఖలైనట్టు సంబంధిత అధికారి జిల్లా నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ సిద్ద లింగమూర్తి పేర్కొన్నారు. గతంలో వైఎస్సాసీపీ మద్దతుదారురాలు కొక. అక్కమ్మ ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆమె అనార్యోగంతో మృతి చెండటంతో వేపకంపల్లి ఎంపీటీసీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం టీడీపీ మద్దతుదారు బొల్లినేడి కనకదుర్గ బుల్నేడి హైమావతి నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు.