కారంపూడి పట్టణం లోని విత్తనాల పాపులపై స్థానిక వ్యవసాయాధికారి పోట్ల నరసింహారావు లో కలిసి విజిలెన్స్ సీఐ పి. శివాజీ, విజిలెన్స్ వ్యవసాయ అధికారి సిహెచ్. ఆదినారాయణ బుధవారం పలు విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాకు రిజిష్టర్లు, బిల్లు పుస్తకాలు, కొనుగోలు అమ్మకాల లావాదేవిలకు సంభందించిన బిల్లులు, భౌతిక నిల్వలు మొదలగు వివరాలు క్షుణ్ణంగా పరిశీలించటం జరిగింది.