కొరిశపాడు మండలం రావినూతలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు శక్తి బృందం ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో బాలికలకు గురువారం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది బాలికలకు ఆపద సమయంలో ఏ విధంగా రక్షణ పొందాలో కరాటే వంటి వాటిని చూపించారు. శక్తి యాప్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని అన్నారు. శక్తి వాట్సాప్ నెంబర్ ను గుర్తుపెట్టుకోవాలని ఎస్సై హరిబాబు తెలియజేశారు.