మాచర్ల పట్టణంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సీడీపీఓ తోట కృష్ణవేణి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ నెల 1 నుంచి 7 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. తల్లిపాలు శిశువు, తల్లి ఆరోగ్యానికి ప్రయోజనకరమని వివరించారు.