మాచర్ల మండలం ఏకోనాంపేటలో ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో తాగు నీరు నిమిత్తం బోరు ఏర్పాటుకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. మాజీ మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు గుండాల శ్రీను కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండాల శ్రీను మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొనడంతో ఎమ్యెల్యే బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్ళిన్నట్లు పేర్కొన్నారు.