మాచర్ల మాజీ ఛైర్మన్ తురక కిషోర్ కు రెంటచింతల గొడవ కేసులో జూనియర్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ గురువారం 14 రోజుల రిమాండ్ విధించారు. మండలంలో 2024లో జరిగిన గొడవకు సంబంధించి సానికంటి సిద్దయ్య అనే వ్యక్తి పెట్టిన కేసులో కిశోర్ ముద్దాయిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కిషోర్ను పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు.