కౌలు రైతు బ్రహ్మారెడ్డి ఇంట జరిగిన కడు విషాదకర సంఘటన ఎవరూ పూడ్చలేనిది అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఏడాది కాలంలోనే కౌలు రైతు బ్రహ్మారెడ్డి, ఈ నెల 12న ఆయన భార్య సుబ్బమ్మల మరణాలు తనను ఎంతగానో కలిచివేశాయన్నారు. తల్లిదండ్రులేక అనాధలుగా మారిన వారి పిల్లల చదువులకు తనవంతు బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.