ఉపాధిహామీ పనులు ఏప్రిల్ 1 నుండి ప్రారంభం: ఎంపిడిఓ ఆదేశాలు

పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ ఆర్. ఫణి కుమార్ ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, మండలంలోని అన్ని గ్రామాలలో 01.04.2026 నుండి ఉపాధిహామీ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. రేపటి నుండి పండగ వాతావరణంలో పనులు మొదలుపెట్టి, శ్రామికులు పెద్దఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని, శ్రామికుల హాజరు ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా నమోదు చేయబడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్