ముప్పాళ్ల: "గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం ధ్యేయం"

ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో రూ. 26 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను శుక్రవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని ఎమ్మెల్యే తెలిపారు. తొలి ఏడాదిలోనే దమ్మాలపాడులో రూ. 94 లక్షల అభివృద్ధి పనులు చేపట్టాం అన్నారు.

సంబంధిత పోస్ట్