పల్నాడు: జంట హత్య కేసులో నిందితులకు బెయిల్

వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో గత ఏడాది మే 24న జరిగిన టీడీపీ నాయకుల జంట హత్య కేసులో నిందితులందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A6గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, A8 వెంకటరెడ్డి సహా మిగతా నిందితులకు సోమవారం బెయిల్ లభించింది. జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, నిందితులందరికీ బెయిల్ రావడంతో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్