పల్నాడు జిల్లా చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్, మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అండర్-13 చెస్ జట్ల ఎంపిక పోటీలను మాచర్లలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నిర్వహించారు. ఈ పోటీలలో బాలుర విభాగంలో మొదటి రెండు స్థానాలలో నిలిచిన K.S మోజెస్, K.J మాగ్నస్, బాలికల విభాగంలో B. మేఘ శ్రీ కోమలి, M. శ్రావ్య లు గెలుపొందారు. ఈ నలుగురు ఆగష్టు 2, 3 తేదీలలో మచిలీపట్నంలో జరిగే అండర్-13 రాష్ట్రస్థాయి పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని పల్నాడు చెస్ అకాడమీ కోచ్ కిరణ్ తెలిపారు.